మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు. వాట్సాప్ సందేశాలను నమ్మి పెట్టుబడులు పెట్టరాదని, తెలియని వాట్సాప్ గ్రూపులలో చేరవద్దని సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఎలాంటి లింకులను తెరవద్దని, వాట్సాప్లో వచ్చే APK ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని తెలిపారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయాలని పేర్కొన్నారు.