ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త డొంక సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని స్థానిక పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5, 450 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.