వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి దోపిడీ

ఒంగోలు నగరంలో శనివారం మధ్యాహ్నం జనార్దననగర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి వృద్ధురాలు నల్లూరి వెంకటశేషమ్మకు మత్తుమందు ఇచ్చి ఆమె మెడలోని 28 గ్రాముల బంగారు గొలుసును దోచుకెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని మంచినీళ్లు అడిగి, చిరునామా పేరుతో ఆమె ముక్కుకు ఖర్చీఫ్తో మత్తుమందు ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతులకు ఉన్న రోల్డ్ గోల్డ్ గాజులను అపహరించుకెళ్లాడు. రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్