ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతు..?

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరుకుపాలెం గ్రామ సమీపంలోని చెరువులో గురువారం నలుగురు చిన్నారులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. చిన్నారుల బట్టలు చెరువు గట్టుపై ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అభిరామ్, సుశాంత్, చిన్ను, దినేష్ అనే చిన్నారులు కనిపించకుండా పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్