ప్రకాశం జిల్లా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఇంట్లో ఘరానా చోరీ జరిగింది. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి 16 సవర్ల బంగారాన్ని అపహరించుకుపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చోరీ జరిగినట్లు గమనించిన పూర్ణచంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.