ఒంగోలులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చిన ముగ్గురు యువకులు శుక్రవారం పూరి ఎక్స్ప్రెస్లో ఒంగోలు చేరుకున్నారు. బాలాజీనగర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా టూ టౌన్ పోలీసులు వారిని గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులు పరార్ కాగా, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 10కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.