ప్రకాశం జిల్లాకు చెందిన గుంజి వెంకటశేషారావు, కరుణ దంపతులు నెల్లూరు మండలం విశ్వనాథరావుపేటలో నివాసం ఉంటున్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్గా పనిచేస్తున్న వెంకటశేషారావు, తన గర్భిణి భార్యపై అనుమానంతో రోజూ గొడవ పడుతుండేవాడు. బుధవారం రాత్రి జరిగిన గొడవలో, భర్త భార్యపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనతో విశ్వనాథరావుపేటలో కలకలం రేగింది.