ఈనెల 8న ఒంగోలులో జాబ్ మేళా

ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 8వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు, 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగినవారు ఇందులో పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 11 వేల నుంచి రూ. 29 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్