ట్రాక్టర్, లారీ ఢీకొని లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలు

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద హైవేపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ను లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్