ప్రకాశం జిల్లా ఒంగోలులోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చెన్నై నుండి విజయవాడ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో మినీ కంటైనర్ లారీ, ఐచర్ వాహనాలు ఢీకొనడంతో రెండు వాహనాల డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.