ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించి, పెద్ద చెర్లోపల్లి మండలంలో పార్కులను ప్రారంభించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పుష్పగుచ్ఛంతో సీఎంను సత్కరించి, స్థానిక పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఇరువురూ లింగన్నపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.