పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ముఖ్యఅతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ప్రతినెల 1వ తేదీలోపు లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్లు అందిస్తున్నారని, మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్