ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 21 డివిజన్ ధారా వారి తోటలో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఓడా ఛైర్మన్ రియాజ్ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా ఇంటి వద్దకే పింఛన్ నగదును పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.