మంగళవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ రాజబాబుతో సమావేశమయ్యారు. ఒంగోలు నగర అభివృద్ధి పనులు, నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీ, రెవెన్యూ సమస్యలపై చర్చించారు. ఈ భేటీలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది కూడా పాల్గొన్నారు.