ముండ్లమూరు మండలం తూర్పుకంభంపాడులో ఓ వివాహిత ఉరి వేసుకుని బుధవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన తాళ్లూరి లక్ష్మి అలియాస్ నాసరమ్మ (42) ఇటీవల సోదరుడు చిన్న నాసరయ్య మృతితో మనోవేదనకు లోనయ్యారు. బుధవారం మధ్యాహ్నం భర్త నిద్రిస్తున్న సమయంలో దూలానికి చీరతో ఉరివేసుకున్నారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.