ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ సమీపంలోని దశరాజు పల్లి వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక లారీ వెనుక మరో లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి, గాయపడిన వ్యక్తిని హైవే పోలీసు వాహనంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.