ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు ఓ వ్యక్తి మృతి కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు ఇచ్చారు. 2018లో ఓ గొడవ జరుగుతుండగా సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిపై ఓ కుటుంబం దాడికి పాల్పడ్డారు. చిరంజీవి అనే వ్యక్తి తీవ్రంగా దాడి చేయగా వెంగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. దర్యాప్తు జరిగిపోయిన కోర్టు పది సంవత్సరాలు జైలు శిక్ష రూ. 7 వేలు జరిమానా విధించింది.