పొన్నలూరు మండలం చెన్నుపాడుకు చెందిన సోదరులు ఉదయ్, మహేశ్ నాయుడుపేటలో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్వగ్రామంలో సోదరి పెళ్లికి గురువారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, గౌరవరం వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందగా, మహేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.