ఒంగోలు పట్టణంలోని 28, 29 డివిజన్ లలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. తదుపరి ప్రజలకు అందించబోయే సంక్షేమ పథకాలు వివరించి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.