ఒంగోలు నగరంలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ డీఈఈ పాండురంగారావు తెలిపారు. మరమ్మతుల కారణంగా మంగమూరు రోడ్డు, ప్రగతి నగర్, మర్రిచెట్టు కాలనీ ప్రాంతాల్లో ఉదయం 7: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఆపేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.