ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఒంగోలు చేరేందుకు సరైన సమయాల్లో బస్సులు ఉండడం లేదు. ముఖ్యంగా ఉదయం పూట స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పల్లెలకు ఉదయం 6కి మాత్రమే బస్సులు ఉండగా, తదుపరి బస్సులు 10 గంటల తర్వాతే వస్తున్నాయి. కావున 8 గంటల సమయంలో కూడా బస్సులు ఏర్పాటు చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు.