ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం మాట్లాడుతూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో ప్రజలు అమరావతిని మర్చిపోయారని అన్నారు. భవిష్యత్తులో వరదలు వస్తే కొట్టుకుపోయే అమరావతిని తాము వ్యతిరేకిస్తున్నామని, అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు అమరావతి ప్రాంత రైతులకు ఏమి చేశారని ప్రశ్నించారు. ధనాన్ని వృధా చేయకుండా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నాన్ని కలిపి రాజధానిని అభివృద్ధి చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆడవారిని అగౌరపరుస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.