బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను శుభ్రం చేసిన పోలీసులు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి, పోలీసులు బుధవారం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. కొందరు మద్యం తాగేవారు పట్టుబడగా, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, మందలించి, జరిమానా విధించారు. వారితోనే ఆ ప్రాంతాలను శుభ్రం చేయించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సిబ్బంది తెలిపారు. బహిరంగ మద్యం సేవనంపై నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్