ప్రకాశం: చీరకు నిప్పంటుకుని మహిళ సజీవ దహనం

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం వెల్లలచెరువులో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బొబ్బాల సీతమ్మ ఇంట్లో వంట చేస్తుండగా, ఆమె చీరకు నిప్పంటుకోవడంతో సజీవ దహనమైంది. ఈ దుర్ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కళ్ళముందే జరిగిన ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందడం అందరినీ కలచివేసింది.

సంబంధిత పోస్ట్