ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ మహిళలు నిరసన చేపట్టారు. కొత్తగా మంజూరైన బార్ షాప్ ను నిర్వహించేందుకు నిర్వాహకులు సామాగ్రి తీసుకువచ్చి ఏర్పాట్లు చేస్తుండగా, చుట్టుపక్కల మహిళలు, సిపిఎం నాయకులు అక్కడకు చేరుకొని మద్యం షాపు వద్దంటూ ఆందోళన చేపట్టారు. మహిళల నిరసనతో మద్యం దుకాణం యజమాని అక్కడినుండి వెళ్లిపోయారు. అధికారులు ఈ ఘటనపై స్థానికులతో మాట్లాడుతున్నారు.