చెరువు కొమ్ముపాలెంలో నిత్యావసరాల అందజేత

మొంథా తుఫానుతో ప్రభావితమైన ఒంగోలు మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామంలో ప్రజలకు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిత్యావసరాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలోని మత్స్యకారులు, చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వరద వచ్చిందని, అయితే అధికారుల సకాలంలో తీసుకున్న జాగ్రత్తల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్