నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇటీవల జిల్లాలో పొగమంచు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో, ఈ వర్షసూచన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వాయుగుండం ప్రభావం జిల్లాపై ఉంటుందని అధికారులు తెలిపారు.