ఉమ్మడి జిల్లాలో సోమవారం రోహిణి కార్తె ప్రారంభంతో ఎండలు తీవ్రమయ్యాయి. జిల్లాలోని 28 మండలాల్లో 24 చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అద్దంకి, బల్లికురవ, ఎస్ఎన్పాడు మండలాల్లో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జె. పంగులూరు, ఒంగోలు రూరల్, నాగులుప్పలపాడు, చీమకుర్తి, కొండపి, మద్దిపాడు, కురిచేడు, ముండ్లమూరు, టంగుటూరు, తాళ్లూరు, కొరిశపాడు, సంతమాగులూరు, కందుకూరు, కొత్తపట్నం, పొన్నలూరు మండలాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.