సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్‌లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకుల సందడి నెలకొంది. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్‌కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేశారు. చిన్నారులు ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.