ఒంగోలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన 'మీకోసం' కార్యక్రమంలో ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ రాజా బాబుకు అర్జీలు సమర్పించారు. అర్జీదారులతో మాట్లాడిన కలెక్టర్ రాజాబాబు, సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు.