ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎవరి దగ్గరి నుంచో లాక్కున్నది కాదని, వెన్నుపోటు పొడిచి తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పార్టీలో చురుగ్గా ఉన్న నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.