పట్టపగులే ఒంగోలులో చోరీ

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని త్రోవగుంట మాలపల్లి గ్రామంలో ఆదివారం పట్టపగలే చంద్రమౌళి అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి రూ. 15 వేల నగదును అపహరించుకెళ్లారు. చర్చికి వెళ్లిన చంద్రమౌళి తిరిగి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్