త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో గ్రామ సమీపంలోని ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు ప్రజలు చెట్ల కింద, శిథిల భవనాల దగ్గర ఉండవద్దని అధికారులు సూచించారు.