ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన నగర సీఐటీయూ కార్యదర్శి మహేశ్, డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు.