రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ వైసీపీ నాయకుల బృందం జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ తదితరులు ఛైర్మన్ జస్టిస్ సుబ్రమణ్యంను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. తమ ఇళ్లపై జరిగిన దాడులు, పార్టీ కార్యకర్త సాల్మన్ రాజు హత్య వంటి అంశాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వారు కోరారు.