సంతనూతలపాడు మండలంలో 91.1 శాతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సచివాలయ సిబ్బంది విజయవంతంగా పంపిణీ చేశారని ఎంపీడీవో సురేశ్ బాబు తెలిపారు. మండలంలోని 15 పంచాయితీలలో 6592 పెన్షన్లకు గాను రూ. 2 కోట్ల 88 లక్షల 66 వేలను ప్రభుత్వం కేటాయించింది. మొదటి రోజునే 6000 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పంపిణీ ప్రక్రియలో సచివాలయ సిబ్బంది చురుగ్గా పాల్గొని లక్ష్యాన్ని చేరుకున్నారు.