హత్యకేసులో నిందితుల అరెస్టు

సంతనూతలపాడు మండలంలోని మంగమూరులో పిల్లి అశోక్ (33) హత్య కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఒంగోలు రూరల్ సీఐ ఎం. శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం, మంగమూరు గ్రామానికి చెందిన పిల్లి అశోక్, అదే గ్రామానికి చెందిన అల్లడి చందుతో స్నేహంగా ఉంటూ, అతని చెల్లెలితో పరిచయం పెంచుకుని తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ విషయం తెలిసిన చందు పిల్లి అశోక్ను మందలించినా వినలేదు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు సీఐ మీడియాకు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్