ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో మంగళవారం అంగన్వాడీ టీచర్ పద్మావతి బాల్య వివాహాల నివారణపై స్థానిక తల్లులతో ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ఆమె వివరించారు. బాల్య వివాహాలు నిర్వహిస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని, బాలికలకు 18 ఏళ్లు నిండే వరకు వివాహం చేయరాదని అధికారులు తెలిపారు.