ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు రెండు రోజుల శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి సిద్ధంగా పంటలు పండించడంపై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారిణి పి. పావని వరి, శనగ పంటలకు అవసరమైన వివిధ రకాల కషాయాలను సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో వివరించారు.

సంబంధిత పోస్ట్