సంతనూతలపాడులో బైకు దగ్ధం

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని పెద్ద చెరువు కట్ట, వాటర్ ప్లాంట్ సమీపంలో సోమవారం ఉదయం విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక స్కూటీ దగ్ధమైంది. వాహనదారుడు గాంధీ పార్ధ వర్ధన్ కంపెనీ నుంచి పాల ప్యాకెట్లు తీసుకువస్తూ ఉండగా, వాహనం వేడెక్కడంతో కొద్దిసేపు ఆపారు. ఇంతలోనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది.

సంబంధిత పోస్ట్