చీమకుర్తి; చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్స్ క్వారీ కార్మికుడు సుబ్రహ్మణ్యం బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా స్థానిక పోలీసులు తెలిపారు. సంస్థ నిర్వాహకులు సరిగా జీతాలు చెల్లించడం లేదని కొద్దిగ రోజుల క్రితం పెట్రోల్ పోసుకొని సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో వైద్యం కోసం అతనిని చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్