ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మంగళవారం రాత్రి తిరునాళ్లను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై డాన్స్ ప్రోగ్రాం ఆకట్టుకుంది. నాలుగు విద్యుత్ ప్రభలను నెలకొల్పగా, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తిరునాళ్లను వీక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.