దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు డా. షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో, దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. కీర్తిశేషులు కొత్త మాసు చిన్న అంకారావు గారి జ్ఞాపకార్థం, ఆయన కుమారులు సురేష్, సుబ్రహ్మణ్యం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల మానసిక ధైర్యాన్ని ఇస్మాయిల్ ప్రశంసించారు. సమాజంలో తోటి వారికి సహాయం చేయడంలో చిన్న అంకారావు గారి కుమారులు ఎప్పుడూ ముందుంటారని, వారి సహకారం అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని సొసైటీ తరఫున తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులు పాలంకయ్య, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్