ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమెట్ట పొగాకు వేలం కేంద్రం వద్ద, పొగాకుకు కేజీ రూ. 300 తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, పొగాకు కొనుగోళ్లు మందకోడిగా సాగడం, గిట్టుబాటు ధర లభించకపోవడంపై తమ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.