మద్దిపాడు మండలం వెల్లంపల్లి అంబేడ్కర్ నగర్‌లో 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమాన్నిశనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ పాల్గొని ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు దళితులను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ పేర్కొన్నారు.