ఆటోలో వృద్ధురాలు మెడల నుంచి బంగారు గొలుసు చోరీ

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో సోమవారం తెల్లపాడు గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే వృద్ధురాలు ఆటోలో ప్రయాణిస్తుండగా, గుర్తుతెలియని మహిళలు ఆమె మెడలోని 14 సవరణల బంగారు గొలుసును దొంగిలించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం పిడుగురాళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట సూర్య తెలిపారు.

సంబంధిత పోస్ట్