చీమకుర్తి పోలీస్ స్టేషన్ ను గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట్ర త్రిపాటి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి క్రైమ్ రిపోర్టును అడిగి తెలుసుకున్నారు. తర్వాత పోలీసు సిబ్బంది సమస్యలపై ఆరా తీశారు. క్రైమ్ సంబంధిత కార్యకలాపాలను అరికట్టేందుకు కట్టు తిట్టంగ వ్యవహరించాలని జిల్లా ఎస్పీ దామోదర్ ను ఆయన ఆదేశించారు. తర్వాత పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను ఐజి పరిశీలించారు.