చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో సుబ్బారావు అనే వ్యక్తి యానాది కుటుంబాలతో వెట్టి చాకిరి చేయించుకుంటూ, వారిపై అత్యాచార యత్నం చేశాడని యానాది సంఘ నాయకుడు చేవూరి వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ కల్పన శుక్రవారం గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. సచివాలయానికి సమీపంలోనే ఈ పరిస్థితి నెలకొన్నప్పటికీ సిబ్బంది గ్రహించలేదని వారిపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.