ఆంధ్రప్రదేశ్‌లో ఎండలతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో శనివారం అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగనుంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కూడా శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.