నాగులుప్పలపాడు: పోలీసుల అదుపులో 11 మంది

నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో జూద స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఎస్సై రజియా సుల్తానా ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో 11 మంది జూదం ఆడుతున్నవారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.46,330 నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్